
నారద వర్తమాన సమాచారం
మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి సోదాలు…
నిన్న తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న సోదాలు..ఆలస్యంగా వెలుగులోకి….
నివాసంలో వారిని బయటకు రానివ్వకుండా విచారిస్తున్న అధికారులు…
అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారంతో సోదాలు…
సుమారు పది కోట్లు వరకు నగదు 25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు , ఎఫ్ డీ లు ఉండొచ్చని అంచనా…
భారీ మొత్తంలో ఉన్న డబ్బు రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల డబ్బా లేక చిట్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బా అనే దానిపై వివరాలు సేకరిస్తున్న ఐటి అధికారులు…..
ఈ నగదు అధికార పార్టీ నాయకుడికి చెందినదా అనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు ఇంట్లో ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చాంశానియంగా మారింది….