
నారద వర్తమాన సమాచారం
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల వాల్ పోస్టర్లు..
ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపు తున్నాయి.వాజేడు మండలం జగన్నాథపురంలోని వై-జంక్షన్ వద్ద మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి.పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని,హిందుత్వ ఫాసిస్టు బీజేపీ,ఆ పార్టీతో అంటకాగుతున్న ఇతర పార్టీలను తరిమి కొట్టాలని వెంకటాపురం – వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు.ఈ వాల్ పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.