నారద వర్తమాన సమాచారం
మరొక్క అవకాశం ఇవ్వండి…
-జరుగుతున్న అభివృద్ధిపనులు పూర్తి చేస్తా
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
-ఐదేళ్ళలో ఎంతో అభివృద్ధి జరిగింది
-ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్ ప్రభుత్వం
-వినుకొండలో ఎన్నో మార్పులు వచ్చాయి…
-శక్తి వంచన లేకుండా పనిచేశా…
-దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు
-మంచిని ఆదరించాలని విజ్ఞప్తి
-మాజీ ఎమ్మెల్యే మక్కెనకు చురకలు
-పోటీ చేస్తుంది జీవీనా మక్కెనా అని ప్రశ్న
-రౌడీ రాజ్యం చేయాలని చూస్తున్నారు
-ఎన్నికలు సజావుగా సాగానిచ్చేలా లేరు
-ప్రత్యేక బృందాలు రప్పించండి కలెక్టర్ కు విజ్ఞప్తి.
వినుకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రజలు మరొక్కమారు అవకాశం కల్పించాలని వైసీపీ అభ్యర్ధి శాసనసభ్యులు బొల్లా బొల్లా బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు యర్రం వెంకటేశ్వర రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజలకు తనికిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వినుకొండలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యాలయాల్లో నూతన భావనాలు ఏర్పాటు చేయటంతోపాటు, ఎన్ఎస్పీ కాలనీలో రెండు ఎకరాలతో బాలికోన్నత పాఠశాల (ఫన్ట్వైర్డు) నూతన భవన నిర్మాణం చేపట్టామని తెలిపారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నాబార్డు నుంచి నిధులు తేవటం, పనులకు టెండర్లు పిలవటం జరిగాయన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఏపీకాలనీలో షాపింగ్ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అనుమతులు తెచ్చామన్నారు.
ఏళ్లతరబడి నిరుపయోగంగా ఉన్న సన్నిధి వెంకట సుబ్బయ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ను రు.3.45 కోట్లతో నిర్మాణం పూర్తి చేసి, పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, పట్టణ ప్రజలకు ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి సమస్యకోసం రు.60 లక్షలతో 60 ఎకరాల సింగరచెరువును 270 ఎకరాల చెరువుగా విస్తరించి నీటి నిల్వ సామర్థ్యం పెంచి తాగునీటి కొరత తీర్చామన్నారు. రు.2కోట్లతో 11 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్ ను నిర్మించి, రు.75 లక్షలతో పైప్ లైన్ లు ఏర్పాటు చేశామని, రు.161 కోట్లతో భవిష్యత్లో నీటి సమస్యను పూర్తిగా తొలగించేందుకు నీటి నిల్వ ట్యాంకులు నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. నూజండ్ల రోడ్డులోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని, అధికారంలోకి వచ్చాక కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని, కొండపైన శ్రీ రామలింగేశ్వర ఆలయం పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.
పట్టణంలోని ఎన్.ఎస్.పి.కాలవకట్టకు ఇరువైపులా సి.సి. రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, ఎన్ఎస్ఏపీలోని విద్యానగర్ సమీపంలో రు. 95 లక్షల రూపాయలతో పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణం అందుబాటులోకి వచ్చిందని, అక్కడ పేదలకు వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ముందు భాగంలో డంపింగ్ యార్డుగా వాడుతున్న స్థలాన్ని ఆక్రమణల చెరనుండి కాపాడి దుర్ఘంధభరితంగా ఉన్న దానిని కాలేజీకి అనుసంధానంగా స్టేడియం నిర్మాణం చేయాలని రు.1కోటి నిధులతో చుట్టూ ప్రహరీ నిర్మించి, మట్టి తోలి రూపురేఖలు మార్చామన్నారు. రు.1.11 కోట్లతో చెత్త రవాణా కేంద్రం ఏర్పాటు, రు.1.28 కోట్లతో వినుకొండ పట్టణంలో మలశుద్ధి కేంద్రాలు ఏర్పాటు జరిగాయని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కట్టుబడి పట్టణంలోని పెట్రోలు బంక్వద్ద ఆక్రమణకు గురైన రోడ్డును పునరుద్ధరించి తారురోడ్డు నిర్మాణం చేశామన్నారు.
రెండు దశాబ్ధాలుగా పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేదలకు జగనన్న కాలనీల ఏర్పాటులో భాగంగా వెంకుపాలెం శివారులో సుమారు 100 ఎకరాలలో సుమారు రు.22కోట్లతో 5,118 మంది ఇళ్ళ పట్టాలు పంపిణీ జరిగిందని,ఇళ్ళ నిర్మాణాలు వేగంగాజరుగుతున్నాయి. ఈ కాలనీలో అత్యాధునిక త్రీఫేజ్ విద్యుత్లన్, కోట్లాది రూపాయలు ఖర్చుచేసి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామని, ఇది మరో వినుకొండగా మారుతుందనటంలో సందేహంలేదన్నారు. తద్వారా పేదలకు సొంత ఇళ్ళు లేదన్న బాధ కూడా తీరుతుందని చెప్పారు.
ఈపూరు మండలంలో నూతనంగా ఎంపీడీవో కార్యాలయం నిర్మాణం చేపట్టామని, 10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం, వనికుంట లో మోడల్ స్కూల్ పనులు చేపట్టామన్నారు. బొల్లాపల్లి మండలంలో వరికపుడిశలకు అనుమతులు తెచ్చి, మెగా ఇంజనీరింగ్ సంస్థ వారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నూజండ్ల మండలంలో ఐదు లిఫ్టు ఇరిగేషన్ల కు అనుమతులు తెచ్చామన్నారు. వినుకొండ రూరల్ మండలపరిధిలో నాగిరెడ్డిపల్లి, పువ్వాడ వద్ద రెండు బ్రిడ్జిలు ఏర్పాటు చేశామన్నారు. తెల్లపాడులో 220 ఎకరాల్లో ఆర్టికల్చర్ కాలేజీకి అనుమతులు తెచ్చామని, అగ్రికల్చర్ కాలేజీతోపాటు, వినుకొండలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చామన్నారు. ఒక నర్సింగ్ కాలేజీ కూడా తెస్తామని చెప్పారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని కొన్ని పూర్తితవగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, పట్టణంలో ఆటోనగర్ కు 10ఎకరాలు కేటాయించామని, అదేవిధంగా లారీ స్టాండింగ్కు మరో 6 ఎకరాలు ఇచ్చామన్నారు. శావల్యాపురం లో సొసైటీ తరపున కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేశామన్నారు. కనుమర్లపూడి వద్ద 40 లక్షలతో బ్రిడ్జి నిర్మించామని, అదేవిధంగా పెదకంచర్లకు సి. సిరోడ్డు, బ్రిడ్జి నిర్మించామన్నారు. ఈ తరుణంలో మరెక్కమారు ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం ఇచ్చి అభివృద్ధిని కొనసాగించి, వినుకొండను అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేసేందుకుఅవకాశం కల్పించాలని కోరారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.