నారద వర్తమాన సమాచారం
మళ్లీ మామూలే..ఎన్ని సార్లు మరమత్తులు చేసిన “వేస్ట్”
ప్రకాశం జిల్లా కంభం మండలం లోని స్థానిక వై. జంక్ష్యన్ వద్ద గల అమరావతి అనంతపురం జాతీయ రహదారి గుండా బస్టాండ్ వెళ్ళు మార్గంలో ఉన్న కల్వర్టు మళ్ళీ ప్రమాదానికి గురైంది…గతంలో కూడా ఎన్నో మార్లు పగిలిన ఈ కల్వర్టును సంభందిత అధికారులు స్పందించి మరమ్మత్తు లు చేయించారు.గతంలో ఈ కల్వర్టు ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు అనేకం.
కల్వర్టు ఏర్పడి కొద్ది కాలం అయినప్పటికీ నేటికీ సుమారు మూడు నుండి నాలుగు సార్లు ప్రమాదానికి గురికావటం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది…
ఇన్ని మార్లు కల్వర్టు ఎందుకు ప్రమాదానికి గురవుతుంది..? నాణ్యత లోపమా అని ప్రజలు అనుకుంటున్నారు…
ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన కల్వర్టు మరమత్తులు చేయించుటకు కూడా సంభందిత అధికారులకు సమయం సరిపోవడం లేదనుకుంటా, వారం పదిరోజులు పైబడితే తప్ప ఆ కల్వర్టు వైపు కన్నెత్తి చూడరు…
నేటికీ కల్వర్టు ప్రమాదానికి గురై వారం రోజులు దాటి నప్పటికీ ఇంకా మరమత్తులు జరపక పోవటం పై ప్రజలు సంభందిత అధికారులపై నిరాశను వ్యక్తపరుస్తున్నారు…
ఇకనైనా సంభందిత అధికారులు స్పందించి వెంటనే ప్రమాదానికి గురైన కల్వర్టుకు మరమత్తులు చేపించాలని కోరుతున్నారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.