Monday, December 2, 2024

ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం వారిపై వైకాపా దాడులు: ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం

మే :14

ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం వారిపై వైకాపా దాడులు: ప్రత్తిపాటి

కావూరులో వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన కార్యకర్తలకు ప్రత్తిపాటి పరామర్శ

సోమవారం పోలింగ్ సందర్భంగా అధికార వైకాపా వాళ్లు కావాలనే పథకం ప్రకారం తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, ఏజెంట్లపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. హింస ద్వారా భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వారందరిపై ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. నిందితులు ఏ స్థాయి వారైనా అరెస్టు చేసి జైల్లో పెట్టాలి, కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిలకలూరిపేట మండలం కావూరులో సోమవారం పోలింగ్ సందర్భంగా వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం పరామర్శించారు. అలానే కావూరులో మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, ఉడతా కోటేశ్వరరావు, తన్నీరు జనార్దన్‌లను పరామర్శించారు. నరసరావుపేట సాయితిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడె ఉమామహేశ్వరరావును పరామర్శించి దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోమవారం సాయంత్రం కావూరు ఎస్సీ కాలనీలోని 211 పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉన్నా ఈవీఎంలు సీలు వేస్తున్నారని ప్రశ్నించడానికి వెళ్లిన తెదేపా వర్గీయులపై వైకాపా నాయకులు దాడులు చేశారు. వైకాపా రాళ్ల దాడిలో తెదేపాకు చెందిన కోడె ఉమామహేశ్వరరావు, మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, తన్నీరు జనార్దన్‌లకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారి పరామర్శల అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి రాష్ట్రంలో హింసా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ సంకేతం ప్రజలందరి కి కూడా చేరేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట ప్రశాంతతను చెడగొట్టాలని చూసిన వారిని ఉపేక్షించకూడదన్నారు. రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ తప్పినిసరిగా మార్పుకి సంకేతమని, త్వరలో ఏర్పాటు కానున్న కూటమి ప్రజాప్రభుత్వంలో ఇలాంటి రౌడీమూకలందరి ఆట శాశ్వతంగా కట్టిస్తామని హెచ్చరించారు ప్రత్తిపాటి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading