నారద వర్తమాన సమాచారం
ఎన్ డి ఏ కూటమి విజయం తధ్యం..నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.
చిలకలూరిపేట :
మే :14
పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ జరిగిన తీరుని పరిశీలిస్తే ఎన్ డి ఏ విజయం తధ్యం అని అర్ధమవుతుంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియా కు ప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పధకాలు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, కూటమి కి నవతరం పార్టీ మద్దత్తు,హైకోర్టులో నవతరం పార్టీ డి బి టి పధకాలు డబ్బులు 14వేలకోట్లు పంపిణీ కాకుండా వేసిన రిట్ విజయం దిశ గా వెళ్లేలా పోలింగ్ జరిగేలా చేశాయన్నారు. అర్ధ రాత్రి వరకు పోలింగ్ కోసం క్యూ లైన్ల లో నిలబడి ఎన్ డి ఏ కి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.నవతరం పార్టీ కూటమి కి మద్దత్తు ఇవ్వడం పట్ల సానుకూలంగా వ్యవహరించిన నవతరం పార్టీ అభ్యర్థులు,నేతలకు రావు సుబ్రహ్మణ్యం 14-05-2024 మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.