15 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తాం: ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి
ఎంపీడీవో ఆఫీస్ వద్ద చర్చలు నిర్వహిస్తున్న అఖిలపక్ష రైతులు.
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలంలో నెలకొన్న ధాన్యం కొనుగోలు సమస్యపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు, అఖిలపక్ష రైతుల, రైస్ మిల్లర్ల యాజమాన్యం లారీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులతో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి బాలాజీ రైస్ మిల్ యజమాని లారీ డ్రైవర్, ఓనర్ పై చేసిన దాడి నేపథ్యంలో మండల వ్యాప్తంగా మూడు రోజులుగా లారీలు బందు చేయగా ఇదే నేపథ్యంలో రైస్ మిల్ యాజమాన్యం అసోసియేషన్ తో కలిసి మిల్లులు బందు చేయడంతో ధాన్యం కొనుగోలు పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చలు నిర్వహించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ విధంగా సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సాయి బాలాజీ రైస్ మిల్ యాజమానీ క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఇదే సందర్భంగా రైస్ మిల్ యాజమాన్యుల రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్లు అందజేసిన వాటిని ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. రైస్ మిల్ కు వెళ్లిన ధాన్యం లారీని వెంటనే తూకం వేసుకొని తర్వాత దిగుమతి చేసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు. దీంతో రైతులంతా శాంతించి కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే కొనుగోలు ప్రారంభించి 15 రోజుల పూర్తి చేసే విధంగా అన్ని విధంగా చర్చలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కందడి భూపాల్ రెడ్డి , అందెల లింగం యాదవ్, వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, మాజీ చైర్మన్ పక్కూరు మల్లారెడ్డి, నాయకులు కోట రామచంద్రారెడ్డి, మన్నె పద్మా రెడ్డి, పకీరు సుధాకర్ రెడ్డి, లారీ డ్రైవర్ యూనియన్ మండల అధ్యక్షుడు రమేష్, రమావత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.