
నారద వర్తమాన సమాచారం
మే :16
ఏపీలో ఉద్రిక్తతలపై ఎన్నికల సంఘం సీరియస్ – సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు..నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎస్,డీజీపి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహార్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇందుకోసం సీఎస్, డీజీపీ నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లుగా ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది
ఏపీ డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి తరదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వాహనాలను తగులబెట్టడం, రాళ్లు రువ్వుకోవడం, మారణాయుధాలతో దాడులు చేసుకోవడం వంటి ఘటనలు జరిగాయి.
కారంపూడిలో టీడీపీ ఆఫీసు ధ్వంసం
పల్నాడు జిల్లా కారంపూడిలోనూ ఉద్రిక్తతలు జరిగాయి. మే 13 పోలింగ్ రోజున ఉద్రిక్తతల్లో గాయపడిన తమ వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తుండగా.. కారంపూడిలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భయానక వాతావరణం సృష్టించారని అరోపణలు ఉన్నాయి.
దాడులు ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా దాడికి తెగబడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఐ నారాయణస్వామికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై మంగళవారం తిరుపతిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపిన సంఘటన కూడా తెలిసిందే..







