
నారద వర్తమాన సమాచారం
మే :16
జనం కసితో ఓటేశారు
ఊహించని ఫలితాలు చూస్తాం .
ప్రత్తిపాటి వెంకట కుమారి
ఓటమి భయంతో వైసిపి నేతలు హింసకు కాలుదువ్విన టీడీపి శ్రేణులు సమయస్ఫూర్తి తో వ్యవహరించారు…
ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడ్డా ఎదురొడ్డి పోరాడిన సైనికులుకు తెలుగుదేశం, జనసేన పార్టీ కేడర్ కి ధన్యవాదాలు…
చిలకలూరిపేట : రాష్ట్ర భవిష్యత్ కోసం జనం కసితో ఓటు వేశారని, ఈ సారి ఎవరు ఊహించని ఫలితాలు చూడబోతున్నామని
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకట కుమారి అన్నారు.
ఈ సందర్భంగా వారు బుధవారం నాడు వారిని కలవటానికి వచ్చిన పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోసం సోమవారం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసే వరకు .నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్న పొలింగ్ బూత్ ల వద్ద ఓట్లు వేసేందుకు ఎండా ను సైతం లెక్క చేయకుండా ఉండటం చూస్తూ ఉంటే . ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని స్పష్టం చేశారు.
ప్రజా స్ఫూర్తితో వైసీపీ కుట్రలు ఎక్కడికక్కడ టిడిపి నాయకులు భగ్నం చేశారని. ఓటమి భయంతో అధికార వైసీపీ నేతలు ఎన్నికల వేళా కుట్రలు పన్నుతూ వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి, ప్రతీ ఓటర్ లోనూ కనిపించిందన్నారు.
కూటమి లోని నాయకులు టీడీపి శ్రేణులు సమిష్టిగా కృషి చేసి ప్రజలు ఓట్లు వేసేవిధంగా పని చేశారని.
అక్కడక్కడ వైసీపీ నేతలం ఓటమి భయంతో హింసకు కాలుదువ్విన పార్టీ శ్రేణులు సమయస్ఫూర్తి తో వ్యవహరించి.తెదేపా ఉమ్మడి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కు మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ‘ ప్రత్తిపాటి వెంకట కుమారి కృతఙ్ఞతలు తెలిపారు.