నారద వర్తమాన సమాచారం
నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం సీజ్: తెలంగాణ పోలీస్
హైదరాబాద్
:మే 17
ఇటీవల హైదరాబాద్ పరిస ర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తు వులు కట్టేస్తున్నారు.
ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు.. మృత్యువాత పడు తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పట్టుకో వాలంటే పోలీసులకు నెంబర్ ప్లేట్లు చాలా ముఖ్యం.
అయితే ఇటీవల ఇలాంటి సందర్భాల్లో సీసీ కెమెరా లను పరిశీలించగా చాలా మంది నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడుపు తున్నట్లు తేలింది. కాగా దొంగలు నడిపే బైక్స్, కార్ల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తు.. అర్థం కాని నెంబర్ల ఉపయోగిస్తున్నారు.
దీంతో దొంగలను పట్టుకో వడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కడ పడితే అక్కడ సీజ్ చేయాల ని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫాబాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్‌లో నంబర్ ప్లేట్లు లేని పలు వాహనా లను ఈరోజు సీజ్ చేశారు. తొలిరోజు 20కి పైగా బైక్‌ల ను సీజ్ చేశారు.
సిబుక్ లో ఉన్న కొత్త నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాహనాలను ఇస్తామని పోలీసులు అంటున్నారు.
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు.
ఈ విషయంలో తల్లిదండ్రు లు తమ పిల్లలను అప్రమ త్తం చేయాలని కోరారు. నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా, స్టిక్కర్లు కనిపించ కున్నా బండిని సీజ్ చేస్తా మని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.