నారద వర్తమాన సమాచారం
మే :17
డెంగ్యూ వ్యాధిని అరికట్టడం మనందరి బాధ్యత
వైద్య అధికారిని బాల అంకమ్మ బాయి
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో క్రోసూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సత్తనపల్లి డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య అధికారిని అంకమ్మ బాయ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వలన వస్తుందని అన్నారు తీవ్ర తలనొప్పి, జ్వరం, శరీరంపై దద్దుర్లు, కండరాల కీళ్ల నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు అన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, పనికిరాని పాత్రలు, పాత టైర్లు, నీటి తొట్టెలు, వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బోండాలు, పగిలిన కప్పులు, పాత కుండలు ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలన్నారు. దోమల నియంత్రణమనందరి బాధ్యత, చేయి చేయి కలుపుదాండెంగ్యూ వ్యాధిని నివారిద్దాం, డెంగ్యూ నివారణ మరియు నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత, బై బై డెంగ్యూ అంటూ సిబ్బంది నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని సిరి చందన , హెల్త్ సూపర్వైజర్ శివుడు ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మా సిస్ట్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.