తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి పట్టభద్రుడు ఓటు వెయ్యాలి.
సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాశ్ రెడ్డి.
నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి పట్టభద్రుడు ఓటు వేయాలని పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి కోరారు.
శనివారం పురపాలక కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయన అన్నారు. నిరంకుశ పాలనపై పోరాటం చేసిన లాటీ దెబ్బలకు జరవకుండా జైలుకు వెళ్లిన భయపడకుండా పోరాటంలో ముందున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి చట్టసభలలో స్థానం కల్పించే బాధ్యత ప్రతి పట్టభద్రునికి ఉందని ఆయన తెలిపారు. ఈనెల 27న జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతి పట్టభద్రుడు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చప్పిడి శేఖర్ రెడ్డి, కొండమడుగు ఎల్లేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.