నారద వర్తమాన సమాచారం
తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి షరుతులతో కూడిన అనుమతి::ఈసీ
హైదరాబాద్
: మే 19
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అను మతి ఇచ్చింది.
జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది.
రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు శనివారం సమావేశంలో పాల్గొనేందుకు సచివాల యానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి అనుమతి రాలేదు.
దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి వెళ్లిపోయారు. రైతు రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయా లతో పాటు..
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వ హణ, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ, తెలం గాణల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రిమం డలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.