నారద వర్తమాన సమాచారం
మే :19
పోలీసులే..నేరస్థులు
తలలు పగులుతుంటే… పోలీసులు స్పందించలేదు
పల్నాడు లో ఇంత హింస ఎప్పుడు జరగలేదు
హింస జరగడానికి చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం.
తొండపిలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలి.
అలసత్వం వహించి, అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలి.
పాత్రికేయుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి
పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా తలలు పగులుతుంటే పోలీసులు స్పందించలేదని, అలసత్వం వహించారని, పల్నాడులో ఈ స్థాయిలో హింస ఏనాడు జరగలేదని, అసలు నేరస్తులు పోలీసులేనని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదు మేరకే పల్నాడు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో జిల్లా అధికారులను మార్చారన్నారు. ఎస్పీలను మార్చిన చోటే హింస చెలరేగిందన్నారు. పల్నాడు లో జరిగిన హింసకు పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే ప్రధానకారణమని ఆరోపించారు.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలు పగలగొట్టి హింసాత్మాక ఘటనలకు పాల్పడ్డారన్నారు.గతంలో ఎప్పుడు ఇంత హింస జరగలేదన్నారు. పల్నాడులో పోలీస్ వ్యవస్థ దారుణం గా ఫెయిల్ అయిందన్నారు.
సిట్ అధికారులకు సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు పై ఫిర్యాదు చేశానన్నారు. అలసత్వం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు అవసరమైతే వారిని రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు లో తొండపి గ్రామం లో శాంతి భద్రతలు పునరుద్ధరించాలన్నారు. ఎల్లో నుంచి బయటికి వెళ్లడం అని తిరిగి స్వగృహాలకు వచ్చేలా పోలీస్ అధికారులు కృషి చేయాలన్నారు.భయపడి గ్రామం వదిలి తల దాచుకున్న కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పోలీసులే కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారన్నారు.తప్పుడు కేసులు పెట్టి భాధితులనే బెదిరిస్తున్నారని, రూరల్ సీఐ రాంబాబు నార్నెపాడు లో జరిగిన జరిగిన ఘటనపై కౌంటర్ కేసులు వేయించి తప్పుడు కేసులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ వైయస్సార్సీపి నే గెలుస్తుందని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారని అంబటి వివరించారు. మళ్ళీ ముఖ్యమంత్రి గా జగన్ విశాఖపట్నం లో ప్రమాణ స్వీకార చేయబోతున్నారని తెలిపారు.
మంత్రి అంబటితోపాటు గుంటూరు ఏ ఎం సి చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.