నారద వర్తమాన సమాచారం
మే :20
లఖ్‌నవూ:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్ బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే.. ఆ సభలో ప్రసంగించకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో తొక్కిసలాట లాంటి పరిస్థితులు చోటుచేసుకోవడమే దీనికి కారణం.
ఫూల్‌పుర్ నియోజకవర్గ పరిధిలోని పాడిలా గ్రామంలో బహిరంగ సభకు రాహుల్ గాంధీ , అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. వీరిని చూడడానికి కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలు ఒక్కసారిగా వేదికవైపు దూసుకురావడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కూడా వారిని నియంత్రించకలేకపోయారు. అఖిలేష్, రాహుల్ విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా వారిద్దరూ ప్రసంగించకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం అలహాబాద్ నియోజకవర్గంలోని ముంగారి గ్రామంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.