నారద వర్తమాన సమాచారం
నేటి నుండి టెట్ పరీక్షలు షురూ
హైదరాబాద్
:మే 20
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టిఎస్ టెట్ 2024 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు టెట్ పరీక్ష ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానం లో టెట్ పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించను న్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు.
టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తం గా 80 పరీక్షా కేంద్రాలు ఏర్పా టు చేయగా, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 25 కేంద్రా లు, రంగారెడ్డి జిల్లాలో 17, కరీంనగర్‌లో 8, ఖమ్మంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హన్మకొండ జిల్లాలో నాలు గు, హైదరాబాద్, మహబూ బ్‌నగర్, సిద్దిపేట, సూర్యా పేటలో జిల్లాకు రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయగా, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొం డ, మెదక్, వరంగల్‌లో జిల్లాకు ఒకటి చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈరోజు 20 నుండి టెట్ పేపర్ 2, ఈ నెల 30 నుండి టెట్ పేపర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉద యం 9 నుంచి 11.30 వరకు సెషన్ 1, తిరిగి మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు సెషన్ 2 పరీక్ష ఉంటుంది. టెట్‌కు మొత్తం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…
పేపర్ 1కు 99,958 దరఖాస్తులు, పేపర్ 2కు 1,86,428 వచ్చాయి. పేపర్ 2కు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 9,162 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ములుగు జిల్లాలో 1,888 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే పేపర్ 1కు వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 5,879 మంది దరఖాస్తు చేసుకోగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 771 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు.
2016లో టెట్‌కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షను విద్యాశాఖ ని ర్వహిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు అర్హత సాధించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్‌సిలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా బి.ఇడి, డి.ఇడి పాసైన అభ్యర్థు లతోపాటు గతంలో టెట్ పాసైన వారు సైతం మార్కులు పెంచుకు నేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.