పోలీస్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 21
• పోలీస్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
• సిపిఆర్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన మరియు శిక్షణ శిబిరం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్.పి శ్రీమతి. సింధు శర్మా ఐ.పి.ఎస్
• జిల్లా ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
• రోడ్డు భద్రత నియమ నిబంధనలు పటిద్దాం ! క్షేమముగా ఇంటికి చేరుకుందాం !!
సి పి ఆర్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన, శిక్షణ శిబిరం మరియు రక్తధాన శిబిరం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సదాశివనగర్ పోలీస్ వారి అద్వర్యంలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో గల అశోక్ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరుకావడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నమని అయినా ఎంతో మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని అందులో ఎక్కవ మంది చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం కారణం అని తెలిపారు, రోడ్డు ప్రమాదాల నివారణకోసం వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రధానంగా ద్విచక్ర వాహనాదారులు హెల్మేటు ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేవారు సీటు బెల్టు ధరించాలని, అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని, రాంగ్ రూట్ లో వాహనాలు నడుపవద్దని, డ్రైవింగ్ చేస్తు సెల్ ఫోన్ చేయరాదాని చెప్పారు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలన వలన దాదాపు 236 మంది మరణిస్తున్నారని 480 మంది క్షతగాత్రులు అవుతున్నారని, గత సంవత్సరం 236 మంది మరణించడం వలన అట్టి కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారని, ఈ సంవత్సరం 128 మరణించారని, 234 క్షతగాత్రులు అయినారు కావున వాహనాదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలి అని జిల్లా ఎస్‌పి . అన్నారు దీనిలో భాగంగా ఆక్సిడెంట్ అయిన సమయంలో మరియు ఇతర ఆపద సమయంలో CPR ఎలా చేయాలో అనే దానిపైన డాక్టర్ టీం తో ట్రైనింగ్ పోలీస్ సిబ్బందికి , యువతకి ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ రోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. దీనిలో బాగంగా వివిధ సర్కిళ్ల సి. ఐ లు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది మరియు యువత స్వచ్ఛంద రక్తదానం చేశారు, సుమారు 50 యూనిట్ల బ్లడ్ ను రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించడం జరిగింది. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడానికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి రక్తదానం చేయాలని సూచించారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున ఎస్పి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ కాజోల్ సింగ్, , డిఎస్‌పి శ్రీనివాసులు, ఎస్బి ఇన్స్పెక్టర్ జార్జ్, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సంతోష్ కుమార్, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, వివిద సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా కార్యదర్శి రాజన్న, డాక్టర్ టీం,పోలీస్ సిబ్బంది, యువత, పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.