నారద వర్తమాన సమాచారం
మే :23
నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్
వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్
జాతీయ టిబి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు 20 25 వ సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి బలహీనమైన వ్యక్తులకు మరియు పెద్ద వయసు ఉన్నవారికి బీసీజీ టీకాను ఇవ్వాలని నిర్ణయించినట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ గురువారం తెలిపారు టీబి వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న పెద్ద వయసు ఉన్న వారికి బీసీజీ టీకా ఇవ్వడం ద్వారా సమాజంలో క్రొత్త టీబి కేసుల సంఖ్య తగ్గింపు జరుగుతుందన్నారు ఈ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులైన వారి గూర్చి ఆమె వివరించారు మధుమేహ వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరముల వయసు దాటిన వారు అందరూ, గత ఐదు సంవత్సరముల క్రితం 18 సంవత్సరములు నిండిన టీబి వ్యాధికి గురైన వారు, 1 జనవరి 2021 తర్వాత టీబీ వ్యాధి గురి అయిన వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియు వారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి, బాడీ మాస్ ఇండెక్స్ 18 కేజీలు/చదరపు మీటరు కన్నా తక్కువ ఉన్నవారికి, గతంలో గాని ఇప్పుడు గాని పొగ త్రాగే అలవాటు ఉందని స్వచ్ఛందంగా తెలిపిన వారికి ఈ అడల్ట్ బిసిజి టీకా కు అర్హులని ఆమె పేర్కొన్నారు ఈనెల 30వ తేదీ గురువారం మరల మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ వయోజనుల బీసీజీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులు కాని వారి గూర్చి ఆయన వివరించారు 18 సంవత్సరముల లోపు వయసు ఉన్న వ్యక్తులు, హెచ్ఐవి సోకిన వారు, గర్భవతులు, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు, డయాలసిస్ కానీ క్యాన్సర్ వ్యాధికి చికిత చేయించుకుంటున్న వారు ఈ అడల్ట్ బి సి జి వ్యాక్సిన్ వేయించుకోకూడదు అని ఆయన పేర్కొన్నారు ఈ వయోజన బీసీజీ టీకా కొరకు ప్రతి సచివాలయం ఆరోగ్య కార్యకర్తను గాని ఆశా కార్యకర్తను గాని సంప్రదించవలసిందిగా ఆయన కోరారు ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకొన వలసిందిగా ఆయన తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.