
నారద వర్తమాన సమాచారం
మే :24
ఢిల్లీ వినియోగదారుల సంఘాలలో చేరీ మోసపోకండి : క్యాప్కో రాష్ట్ర కార్యదర్శి హెచ్.ఎస్ రామకృష్ణ
పుట్ట గొడుగులుగా వస్తున్నా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న వినియోగదారుల సంఘాలు ఇతర రాష్ట్రలలో వినియోగదారుల రక్షణ చట్టం పై పని చేయడం కోసం ఆసక్తి కల వారికి రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష పదవులు అమ్ముకొంటూ మోసానికి పాల్పడుతున్నాయి అని కాప్కో రాష్ట్ర కార్యదర్శి హెచ్.ఎస్ రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర పదవికి 30 వేల నుండి 50 వేల వరకు వసూల్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర అధ్యక్షులు జిల్లాకి అధ్యక్షులని, అలాగే జిల్లా వారు మండల అధ్యక్షులని నియామకం పదవి బట్టి వసూల్ చేస్తున్నారని తెలిపారు. వీరికి జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, జిల్లా విజిలన్స్ లాంటి పోస్ట్లు కి నామినేట్ చేస్తాము అని డబ్బులు వసూల్ చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, విజిలెన్స్ కమిటీలలో లోకల్ గుర్తింపు ఉన్న వారిని మాత్రమే తీసుకొంటారు అని, 1986 నుండి ఇప్పటి వరకు ఈ ఢిల్లీ సంఘాల సభ్యులు ఎవర్ని తీసుకోలేదని, ఈ సంఘాల మాయలోపడి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. ఇంకా కొన్ని సంఘాలు పెట్రోల్ బంక్, రైస్ మిల్లర్ల వద్ద, అలాగే హోటల్స్, స్వీట్ షాప్స్ వద్ద దాడులు ఎలా నిర్వహించాలి వారి దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయలి అనే విషయాల పై శిక్షణా శిబిరంలు ఏర్పాటు చేస్తూ ఈ వినియోగదారుల రక్షణ చట్టంని భ్రష్టు పట్టిస్తున్నారు. మరికొన్ని సంఘాలు రాష్ట్ర, జిల్లా కన్స్యూమర్ కమీషనర్ ప్రెసిడెంట్ కి, మెంబెర్స్ కి సన్మానం చేసి వారితో ఫోటోస్ తీసుకొని, బయట మాకు వారికి మంచి పరిచయాలు ఉన్నాయి అని చెప్తూ వ్యాపారులని బెదిరిస్తున్నారు. ఇంకా కొన్ని సంఘాలు కొంతమంది అడ్వకేట్లని మెంబెర్స్ గా జాయిన్ చేసుకొని రాబోయే రోజులలో మీకు కమిషన్ లో మెంబర్స్ గా అపాయింట్మెంట్ చేయిస్తాం అంటూ వేల రూపాయలు మెంబెర్షిప్ క్రింద వసూల్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సంఘాలు ఏదయినా ప్రోడక్ట్ రిపేర్ వస్తే 10 మంది ఆ షాప్ పై దాడి చేయడం, వారిని బెదిరించి వేరే ప్రోడక్ట్ పట్టుకొని పోవడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి చేయడానికి ఏ సంఘాలకీ అధికారం లేదు. ఏదయినా ఫిర్యాదు వస్తే నోటీసు ఇవ్వాలి తప్పా ఇలా షాప్ యజమానులని బెదిరించడం నేరం. దయచేసి ఇలాంటి సంఘాలలో సభ్యులు ఎవరు జాయిన్ అవ్వవద్దు. అలా ఇటువంటి సంఘాలలో చేరి పోలీస్ కేసులలో ఇరుక్కోవద్దు. మరికొంత మంది ప్రభుత్వంలో ఉండి కమీషన్, ఫోరమ్ లాంటి పేర్లుతో తమ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ప్రభుత్వ సంస్థ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సివిల్ సప్లయిస్ కమీషనర్ ఈ పేర్లు వెంటనే తొలగించమని, లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొవడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలో తెలియ చేశారు అని, అలాగే ఈ వినియోగదారుల చైతన్యం లో మీరు కూడా పాలు పంచుకోవాలంటే 9247122720 ఫోన్ చేయవలసిందిగా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాప్కో) రాష్ట్ర కార్యదర్శి హెచ్.ఎస్. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.