![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/img-20240524-wa12585151424096517763029-300x295.jpg?resize=300%2C295&ssl=1)
నారద వర్తమాన సమాచారం
ఎవరెస్ట్ ను అధిరోహించిన 16 ఏళ్ళ అమ్మాయి
ముంబయి
: మే 24
ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసా ధారణ రికార్డు నెలకొల్పింది.
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను నేపాల్ వైపు నుంచి అధిరోహించిన తొలి భారత పిన్నవయస్కు రాలిగా నిలిచింది.
అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కు రాలిగా ఖ్యాతిగాంచింది. భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎస్. కార్తికేయన్ తో కలసి కామ్యా ఈ నెల 20న 8849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ ను అధిరోహించింది.
ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేసింది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.