నారద వర్తమాన సమాచారం
మే :25
ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వి.ఎ.ఎక్మో చికిత్స ద్వారా మాసివ్ హార్ట్ ఎటాక్ కు గురైన యువ ఇన్ఫోసిస్ ఇంజినీర్ ను కాపాడిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం
ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 35 సంవత్సరములు యువకుడు మంగళగిరిలోని ఒక గుడికి ఉదయం 9 గంటలకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఛాతి నొప్పిగా,బరువుగా అనిపించి, దానిని గ్యాస్ నొప్పిగా భావించి యాంటాసిడ్ మాత్ర తీసుకున్నాడు. నొప్పి తగ్గకపోగా మరింత పెరగగా మంగళగిరిలోని స్థానిక నర్సింగ్ హోమ్ కు వెళ్లగా వారు ఈసీజీ పరీక్షలు నిర్వహించి హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా నిర్ధారించి వెంటనే గుండె జబ్బులు వైద్యం అందించే హాస్పిటల్ కి వెళ్ళమని సూచించారు. గుంటూరులో ఉన్న ఫ్యామిలీ ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళగా ఆయన కొన్ని పరీక్షలు చేసి తీవ్రమైన గుండెపోటుగా నిర్ధారించి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ కు రిఫర్ చేయడం జరిగింది.
మధ్యాహ్నం రెండు గంటలకు హాస్పిటల్ కి చేరుకున్న రోగిని వెంటనే ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్.రామారావు నేతృత్వంలోని గుండె వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించి గుండె పంపింగ్ తగ్గిపోవడం,కార్డియోజెనిక్ షాక్, పల్మనరి ఎడిమా వంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగికి వెంటనే వెంటిలేటర్ అమర్చి క్యాథ్ ల్యాబ్ కు తరలించి ఇంట్రా అయోటిక్ బెలూన్ పంపు అమర్చి యాంజియోగ్రాం పరీక్ష నిర్వహించగా గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం 100% రక్తపు గడ్డలతో పూడిపోయి ఉండటం గమనించి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా రక్తపు గడ్డలను తొలగించడం జరిగింది.
గుండె అతివేగంగా కొట్టుకోవడం,రక్తపోటు తగ్గిపోవడం, మూత్రం కొద్దిగా మాత్రమే రావటం,వెంటిలేటర్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ సరిపోకపోవడం,గుండె పనితీరు చాలా బలహీనంగా ఉండటం వంటి లక్షణాలతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోనికి వెళ్లడంతో రోగి యొక్క సహాయకులకు ఇటువంటి పరిస్థితుల్లో ఆఖరి ప్రయత్నంగా “ఎక్మో” అనే లైఫ్ సైవింగ్ మెషీన్ ఉపయుక్తంగా ఉంటుందని వారికి సూచించగా వారి యొక్క అంగీకారంతో రోగికి ఎక్మో మెషీన్ కనెక్ట్ చేయడం జరిగింది.
కార్డియోజనిక్ షాక్ నుంచి కోలుకున్న తరువాత ఐదు రోజులకు ఎక్మో మెషీన్ నుంచి బయటకు తీసుకు రావడం జరిగింది.
లెఫ్ట్ మెయిన్ 100% మూసుకుపోయి కటాఫ్ అయిన స్థితిలో వచ్చిన రోగికి ఎమర్జెన్సీ యాంజియో ప్లాస్టి చికిత్స,ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్,ఎక్మో మెషీన్ సహాయంతో రోగిని ప్రాణహాని నుంచి కాపాడగలిగామని ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి వైద్య చికిత్స మొదటిసారిగా అస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో నిర్వహించామని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్. రామారావు తెలియజేశారు.
మాసివ్ హార్ట్ ఎటాక్ వలన గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడంతో ఈ రోగికి ఊపిరితిత్తులలో నీరు చేరుకుని, మూత్ర పిండాలు పనితీరు మందగించడం వలన ఇదే పరిస్థితి ఇంకో 2 నుంచి 3 గంటలు కొనసాగితే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేవాడని అత్యాధునిక వి.ఎ.ఎక్మో పద్ధతి ద్వారా గుండె మరియు ఊపిరితిత్తుల మీద పూర్తిగా ఒత్తిడి తగ్గించి కృత్రిమంగా ప్రాణ వాయువును ఈ మెషీన్ ద్వారా శరీరానికి అందించడం వలన రోగి త్వరగా కోలుకున్నాడని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్.పి.ఎన్.ఎస్.హరిత తెలియచేసారు.సడెన్ హార్ట్ ఎటాక్ వలన సంభవించే దుష్ఫలితాలను అధిగమించడానికి ఎక్మో తరహా వైద్య విధానం ఎంతో మేలు చేస్తుందని డాక్టర్.హరిత తెలియ చేసారు.
35 సంవత్సరములు యువకుడు అత్యవసర పరిస్థితుల్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ కు రాగా అత్యవసరంగా వైద్యం అందించి, అధునాతన వైద్య పరికరాలు అమర్చి ప్రాణాపాయం నుంచి కాపాడిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్.రామారావు,క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్.శిల్పా చౌదరి, కార్డియో థొరాసిక్ సర్జన్లు డాక్టర్.జయరామ్ పాయ్, డాక్టర్.శివప్రసాద్,ఎక్మో స్పెషలిస్ట్ డాక్టర్.బికాస్ సాహు లతో కూడిన సూపర్ స్పెషాలిటీ వైద్య బృందాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్.పోతినేని రమేష్ బాబు అభినందించారు నిష్ణాతులైన వైద్య నిపుణులు,అధునాతన వైద్య పరికరాలు,జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో అవలంబిస్తున్న అత్యాధునిక వైద్య విధానాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి క్లిష్టతరమైన వైద్యాన్ని విజయవంతంగా అందించగలిగామని డాక్టర్.రమేష్ బాబు తెలియజేశారు.
ఈ పత్రికా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మమత రాయపాటి, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్.కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.