నారద వర్తమాన సమాచారం
మే :27
సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.సుదీర్ రెడ్డి
బాధితుడు అరవింద్ కుమార్ కి 1,50,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీకు చెందిన అరవింద్ కుమార్ వెన్నుముక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థికస్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అట్టి ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి గాను వారికి 1,50,000(ఒక లక్ష యాబై వేల రూపాయలు) ఎల్.ఓ.సీ.చెక్కు మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ.పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో బాధితుని తల్లి ప్రసన్నరాణి,రాకేష్ ఠాగూర్ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.