ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
భూదాన్ పోచంపల్లి లో బారులు తీరిన ఓటర్లు
భూధాన్ పోచంపల్లి కుమారితో కలిసి ఓటు వేసి వస్తున్న మహిళ
భూదాన్ పోచంపల్లి లో ఓటు వేసిన మహిళా ఓటర్లు
పట్టణ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1966 ఓట్లకు గాను 1656 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 84.23% పోలింగ్ నమోదైనట్లు తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, భారాస నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, భాజపా నాయకులు గూడూరు నారాయణరెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డిలు సందర్శించి పరిశీలించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.