నారద వర్తమాన సమాచారం
తెలంగాణ
కొత్తగూడెం
1,23,00,000/- రూపాయల విలువ గల 492 కేజీల గంజాయిని పట్టుకున్న కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు
సినీ ఫక్కీలో నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు కొత్తగూడెం 3టౌన్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా సుమారుగా మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అశోక్ లైల్యాండ్ డి సి ఎమ్ వ్యాన్ ఎమ్ హెచ్ 20ఈ ఎల్ 5732 లో క్యాబిన్ వెనుక భాగానికి సమాంతరంగా అనుమానం కలుగకుండా ప్రత్యేకంగా మరొక అరను తయారుచేసి అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వ్యానులో నిషేధిత గంజాయిని గుర్తించిన అనంతరం బయటకు తీసి తూకం వేయగా 492 కేజీలు ఉన్నట్లు తేలింది.దీని విలువ సుమారుగా రూ.1,23,00,000/-(ఒక కోటీ ఇరవై మూడు లక్షలు) ఉంటుంది.జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి 3టౌన్ పోలీసులు ఇట్టి గంజాయిని పట్టుకోవడం జరిగిందని 3టౌన్ సిఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు.
1).శుభమ్ శరత్ బండారీ,సన్ / ఆఫ్ .శరత్ లక్ష్మణ్ బండారి,27సం , ,ఆటో డ్రైవర్,ఆర్ / ఓ . హౌస్ .నం , 25,సంస్కృతి కాలనీ,ఫర్సుంగి,పూణే, మహారాష్ట్ర మరియు 2).అంజత్ అబ్దుల్ షేక్,ఎస్ / ఓ .అబ్దుల్ మల్సూర్ షేక్, 36సం లారీ డ్రైవర్, ఆర్ / ఓ .ఆలంగర్ ఏరియా,నాగర్ మండల్,అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర అను ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,సీలేరు వద్ద పెద్దగొండి గ్రామానికి చెందిన రాజు అను వ్యక్తి వద్ద ఇట్టి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర,షోలాపూర్ కు చెందిన యోగేష్ అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్తుండగా ఈరోజు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది.పట్టుబడిన ఇద్దరు నిందితులకి సోలాపూర్ కి చెందిన యోగేష్ డబ్బులు ఇచ్చి గంజాయిని తీసుకుని రమ్మని చెప్పగా,వీరిరువురు ఇట్టి గంజాయిని వ్యానులో తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది.నిషేధిత గంజాయిని విక్రయించిన రాజు మరియు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన యోగేష్ మరియు రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు.పట్టుబడిన ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించడం జరిగిందని తెలియజేశారు.
నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న త్రీ టౌన్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.