నారద వర్తమాన సమాచారం
రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
అంతర్గత సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
:మే 28
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ హంగులతో అధునాతనంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో అంతర్గత సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ పని తీరు, మౌలిక వస తులు, ఉద్యోగ ఖాళీలు తదితర అంశాలను ఈ సందర్భంగా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందిస్తున్న ఆ శాఖను మరింత పటిష్ట పరచాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్లకు వచ్చేవారికి కూర్చోడానికి కనీసం కుర్చీ లు కూడా లేకపోవడంతో చెట్ల కింద, నీడ దొరికిన చోట నిరీక్షిస్తున్నారనీ, ఇకపై ఆ పరిస్థితి ఉండకూడదని అన్నారు.
అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లను మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ”రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో 38 ఆఫీసులు మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్‌లో బోథ్, మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో కొత్తగా నిర్మించిన కార్యాలయాలు ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగు తున్నాయి. 52 చోట్ల ఆఫీ సులకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటా యించింది” అని సీఎంకు అధికారులు వివరించారు.
భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలనీ, మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని ఈ సందర్భంగా అధికారు లను ఆదేశించారు.
పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే అక్కడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.