
నారద వర్తమాన సమాచారం
సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దంటూ వ్యక్తి పిటిషన్
డిల్లీ
మే 29
భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కోసం కొత్త భవన సముదాయం నిర్మించేందుకు, ఇప్పుడున్న సుప్రీంకోర్టు భవనాలను కూల్చివేయవద్దంటూ కేకే రమేశ్ అనే వ్యక్తి మంగళ వారం సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉన్న సముదాయంలో 17 కోర్టు రూములు, రెండు రిజిస్ట్రార్ కోర్టు రూములు ఉన్నాయ ని, వాటి స్థానంలో రూ.800 కోట్లతో కేంద్రం కొత్త భవనా లు నిర్మించేందుకు సిద్ధమైం దని పిటిషనర్ ఆరోపిం చారు.
దేశంలోని స్మారక నిర్మాణా ల్లో సుప్రీంకోర్టు కూడా ఒకటని, కొత్త భవన సముదాయం కోసం ఈ నిర్మాణాన్ని కూల్చివేయడం తగదని కేకే రమేశ్ పేర్కొన్నారు.
దీన్ని కూల్చివేయడం కంటే మరో విధంగా ఉపయోగిం చుకోవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశా లు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఒకవేళ సుప్రీంకోర్టు కొత్త భవన సముదాయంలో 27 కోర్టు రూములు, 4 రిజిస్ట్రార్ కోర్టు రూములు నిర్మించినప్పటికీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా అవి సరిపోవని తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని, సమాజ స్థితిగతులు మారిపోతున్నాయని, ఈ కోర్టు రూములు కూడా చాలని పరిస్థితి ఎదురవు తుందని వివరించారు.
మరో పదేళ్లలో సుప్రీంకోర్టు లో కేసులు కూడా వేగంగా పెరిగిపోతాయని తన పిటిషన్ లో ప్రస్తావించారు…