జిల్లా లో నకిలీ విత్తనాల సరఫరా, క్రయ, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గ్రామాలలో నకిలీ విత్తనాలు అమ్మీ రైతులను మోసం చేసే వారి పై పటిష్ఠ నిఘా, కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ రితిరాజ్,
నారద వర్తమాన సమాచారం
మే 29,
గద్వాల్ : జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , ఉత్పతి , విక్రయాలు జరిపి రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నకిలీ సీడ్స్ అమ్మే వారి పట్ల రైతులు మోసపోకుoడ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.
ఆరుగాలం కష్టించి పని చేసే రైతులు మోసపోకుండా ఉండేందుకు జిల్లా లో నకిలీ సీడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిల్లా ఎస్పీ గారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో గతం లో నమోదు అయిన నకిలీ విత్తనాల కేసుల వివరాలను పరిశీలించారు.ఆయా కేసులలో ఉన్న నిందితుల పై పోలీస్ అధికారులు నిఘా ఉంచాలని, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు, ఎలా జీవనం కొనసాగిస్తున్నారు వంటి వివరాలు తెలుసుకొని నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసులలో సాక్ష్యాధారాలు సేకరించడం తో పాటు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్, ఏ. ఓ రిపోర్ట్ పకడ్బందీగా సబ్మిట్ చేసి ఆయా కేసులలో నిందితులకు శిక్షలు పడేందుకు కృషి చేయలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. వర్ష కాలం సమీపిస్తున్న వేళ గ్రామాలలో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలలో వీ పి ఓ ల ద్వారా నిఘా పటిష్ఠం చెయ్యాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో నకిలీ విత్తనాలు జిల్లాలోకి రావడం గాని, జిల్లా నుండి బయటకు వెళ్లడం జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, విత్తనాలు అమ్మే షాపులు లలో నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలనీ , లూస్ విత్తనాలను కొనవద్దని, గుర్తింపు పొందిన కంపనీ డీలర్ల వద్ద మాత్రమే సీడ్స్ ను తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైన తక్కువకు విత్తనాలు వస్తాయoటే కొని మోసపోవద్దు అని,జర్మినేషన్ టెస్ట్ లో ఫెయిల్ అయిన విత్తనాలను విక్రయించే అవకాశం ఉందని వాటిని కొని మోసపోవద్దు అని అలాగే ఇతర ప్రాంతాల నుండి గ్రామాల్లోకి వచ్చి నకిలీ లేబుల్ తో అమ్మే విత్తన ప్యాకెట్స్ లను తీసుకోవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు .
జిల్లా లో ఎవరైనా నకిలీ సీడ్స్ ను అమ్మిన, సరఫరా చేసిన, అలాంటి వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అలాంటి వారి పై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు
అనంతరం అరెస్టు పెండింగ్ కేసుల పై, ఎన్ బి డబ్ల్యూ ఎస్ పెండింగ్ కేసుల పై సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు.కొత్త చట్టాల పై శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జులై నెల నుండి అమల్లోకి రానున్న కొత్త చట్టాలు అయిన భారతీయ సాక్ష్య ఆధినియం, భారతీయ న్యాయ సంహిత మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాల పై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అవగాహాన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు.కొత్త చట్టాల పై అవగాహన శిక్షణకు జిల్లా నుండి వెళ్లి వచ్చిన పోలీస్ అధికారులతో ఇతర పోలీస్ అధికారులకు అవగహన కల్పించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ మూడు కొత్త చట్టాలు నేరస్థులకు శిక్ష పడేవిదంగాచేయడం,
బాధితులకు న్యాయం అందించడం పైన ఎక్కువ దృష్టి సారిస్తాయని తెలిపారు.సత్వర న్యాయంఅందించడం,
న్యాయవ్యవస్థ మరియు న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా ‘భాధితులకు న్యాయం అందించడం’ పై కేంద్రీకృతం చేయబడ్డాయని తెలిపారు.ఈ మూడు కొత్త చట్టాలకు డిసెంబర్ 21,2023న పార్లమెంట్ ఆమోదం లభించిందని తెలియజేసారు.బాధితుల హక్కులనుపరిరక్షించడం,నేరాల విచారణ మరియు విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా అవసరమైన మెరుగులు దిద్దడం జరిగిందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ చట్టాలు కాలానుగుణంగా నవీకరించబడ్డాయని ,క్రిమినల్ చట్టాల సూక్ష్మ నైపుణ్యాలను మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం మరియు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి ఎస్పీ క్లుప్తంగా వివరించారు.
తాజా మరియు సవరించిన చట్టాలను అమల్లోకి తీసుకురావడంలో పోలీస్ శాఖ పాత్ర చాలా కీలకమని అన్నారు.కొత్త చట్టాలలో పేర్కొన్న శిక్షలు,నిబంధనల పట్ల జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన అధికారులు మరియు సిబ్బంది అందరికీ ఈ చట్టాల పట్ల శిక్షణ పొందిన అధికారులతో జిల్లా వ్యాప్తంగా దశల వారీగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.క్రమశిక్షణతో ఈ శిక్షణా తరగతులను పూర్తిచేసుకుని చట్టాల పైన పూర్తి అవగాహన కలిగియుండాలని ఎస్పీ సూచించారు.ఈ సమీక్షలో డి. ఎస్పీ సత్యనారాయణ గారు, గద్వాల్ ఆలంపూర్, శాంతి నగర్ సి. ఐ లు బీమ్ కుమార్, రవి బాబు, రత్నం, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ఐటీ, డిసీ ఆర్బీ ఎస్సై లు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.