Thursday, December 26, 2024

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు

నారద వర్తమాన సమాచారం

మే :31

తాటి ముంజలు

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి వేసవి దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. వీటిని కన్నడలో ‘తాటి నుంగు’ అని.. తమిళంలో ‘నుంగు’ అని అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికీ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.
తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఐరన్‌లతో పాటు అనేక పోషకాలు కలవు..
తాటి ముంజలు -ఆరోగ్య ప్రయోజనాలు:

1.చలువ కోసం
ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి.. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే!

2.నిర్జలీకరణం నుంచి ఉపశమనం
తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి.
వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

౩.రక్త పోటును అదుపులో ఉంచును: వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

4.గర్భిణులకూ మంచిది
గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. గర్భిణులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

5.బరువునూ తగ్గిస్తాయి
తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీరంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి.

6.విషపదార్థాలు మాయం
తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. తాటి ముంజాల లో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.

7.ఉదర సమస్యల నివారణ:
తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబందిత సమస్యను తగ్గిస్తాయి. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పనిచేస్తాయి వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబందిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.

8.వాంతుల నివారణ:
వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది.

9.క్యాన్సర్ల నుంచి రక్షణ :
తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది

10.అలసట దూరం చేయును.
వేసవిలో అలా కాసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం కదా! అంతేకాదు.. విపరీతమైన చెమట పోస్తుంది.. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినడం..

11.చర్మ సంరక్షణ: తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మొటిమలను తగ్గించడంలోనూ ముంజలు బాగా పనిచేస్తాయి.

పొట్టు తీయకుండా తినాలి
చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading