నారద వర్తమాన సమాచారం
ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించేది లేదు- పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐ పీ ఎస్
పోలీసు సిబ్బంది లో మనోధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని కలిగిస్తూ సుమారు 350 మంది సాయుద బలగాలతో నరసరావుపేట టౌన్‌లో ఏర్పాటు చేసిన మెగా ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్.అనంతరం వినుకొండ చేరుకుని బస్ స్టాండ్ సెంటర్లో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వారిని ఉద్దేశించి మాట్లడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఫలితాల వెలువడిన తరువాత ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తామని ఎస్పీ కి తెలియజేశారు.
అదేవిధంగా వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సమస్యాత్మక గ్రామాల నుండి వచ్చిన సుమారు 200 మంది ట్రబుల్ మంగర్స్ కి మరియు ఎన్నికల నేరాలలో ఉండి బెయిల్ పై బయటకొచ్చిన ముద్దాయిలకు ఎస్పీ గకౌన్సిలింగ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని లేనియెడల రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని వారి ఆస్తులను జప్తు చేయిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడ కూడా ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమికూడా రాదని అలా గుమికూడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
విజయాంతరం ఎటువంటి ఉత్సవాలకు, ర్యాలీలకు, బాణాసంచా పేల్చుటకు, సభలు నిర్వహించడానికి వీలులేదని తెలియజేశారు. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అందరిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపుతామని తెలియజేశారు.
జిల్లాలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుద బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
జిల్లాలో ఏ పెట్రోల్ బంకు లోను విడిగా పెట్రోలు, డీజల్ అమ్మరాదని వారికి ముందస్తుగా నోటీసు ఇవ్వడం జరిగిందని అలా కాక విడిగా పెట్రోల్ అమ్మితే వారిపై చట్ట పప్రకారం చర్యలు తీసుకొని అట్టి పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని తెలియజేశారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం 161 కేసులు కట్టడం జరిగింది దీనిలో ఇప్పటివరకు 1320 మందిని అరెస్టు చేయడం జరిగింది మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తాము దీనికి సంబంధించి ప్రత్యేక టీములను ఫామ్ చేసి ఉన్నాయని తెలియజేశారు.
అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 382 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగినది. అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము.
అదేవిధంగా ఇప్పటివరకు 120 వాహనాలను సీజ్ చేసి 102 సి ఆర్ పి సి కేసులు కట్టడం జరిగినది. ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా అందులో సుమారు 250 మంది బైండోవర్ నీ ఉల్లంఘించడం జరిగినది వీరిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీరి చేత ఆ బాండ్ అమౌంటును కట్టించడం లేదా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది లేనిపక్షంలో వారంట్ తీసుకొని జైలుకు పంపడం జరుగుతుంది. నేరాలను అదే పనిగా చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణ కొరకు ప్రపోసల్స్ రెడీ చేస్తున్నాము.ప్రజలు ఎటువంటి నేరాలలో పాల్గొనరాదని, మీ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మీరు కేసుల్లో ఉంటే బెయిల్ కోసం మీ ఆస్తులు అమ్ముకోవాలి, మీరు ఇతర దేశాలకి చదువుల కోసం వెళ్లలేరు అని ఎస్పీ తెలిపారు, ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగినది, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా స్వేచ్ఛ జీవనానికి ప్రజాప్రతినిధులు,ప్రజలు, మీడియామిత్రులు సహకరించాలని పోలీసువారి ముందస్తు సూచనలు పాటించాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు నరసరావు పేట డిఎస్పి సుధాకర్ రావు , నరసరావు పేట,మరియు వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.