కామరెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవ ఎన్నిక..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మే 31,
కామారెడ్డి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ చైర్ పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్ పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆథరైజ్డ్ అధికారికి ఆర్డీఓ రంగనాథ్ ను నియమించింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్.డి.ఓ. రంగనాథ్ రావు అధ్యక్షతన నూతన వైస్ చైర్ పర్సన్ కొరకు జరిగిన మునిసిపల్ ప్రత్యేక సమావేశంలో 10 వ వార్డుకు చెందిన ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్.డి.ఓ. ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మునిసిపల్ వార్డులు, ఒక ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే తో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరం కు 26 మంది సభ్యులు కావలసి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్ లో ఉర్దొండ వనిత పేరు వచ్చిందని, వైస్ ఛైర్పర్సన్ పోటీకి ఎవరు లేనందున ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు. వనిత దైవం మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ సుజాత, మునిసిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.