Friday, November 22, 2024

కౌంటింగ్ సెంటర్ వద్ద మరియు జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు,గొడవలు,అల్లర్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే మా లక్ష్యం- పల్నాడు జిల్లా ఎస్పీ  మల్లిక గర్గ్ ఐ పీ ఎస్

నారద వర్తమాన సమాచారం

మే :31

పల్నాడు జిల్లా పోలీస్,

కౌంటింగ్ సెంటర్ వద్ద మరియు జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు,గొడవలు,అల్లర్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే మా లక్ష్యం- పల్నాడు జిల్లా ఎస్పీ  మల్లిక గర్గ్ ఐ పీ ఎస్

పల్నాడు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించబోతున్న రెవిన్యూ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు మరియు జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగులో పాల్గొన్న ఎస్పీ

కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ అధికారులకు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడిన దగ్గరలో ఉన్న పోలీసు వారికి తెలియజేయాలని పోలీసు వారు కౌంటింగ్ సిబ్బందికి రెవెన్యూ ఆఫీసర్లకు అందుబాటులో ఉండి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తారని తెలియజేశారు.

అనంతరం జిల్లాలో కౌంటింగ్ బందోబస్తుకు వచ్చిన ఇతర జిల్లాల పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రత్యేక పోలీసు బలగాల అధికారులు, అక్టోపస్ కమాండోస్, సాయుధ బలగాల అధికారులతో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

ఈ కార్యక్రమంలో ఎస్పీ  మాట్లాడుతూ..

జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను ప్రస్తుత రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు.
కొత్తగా బయట జిల్లాల నుంచి వచ్చిన ఆఫీసర్లకు ఆ మండలం, ఆ గ్రామం యొక్క జియోగ్రాఫికల్ మ్యాప్ ను, అదేవిధంగా ఆ మండలంలో ఎన్నికల సమయంలో జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను, ఆ కేసులలో ఉన్న ముద్దాయిల వివరాలు, అరెస్ట్ కాబడిన వారి వివరాలు, అరెస్టు కావాల్సిన వారి వివరాలు, బైండవర్ అయ్యారా అవ్వలేదా అన్న వివరాలు, ట్రబుల్ మంగార్స్ యొక్క వివరాలు, రౌడీ షీటర్ల యొక్క వివరాలు కలిగిన ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగినది.
దీని ద్వారా కొత్తగా బందోబస్తు కి వచ్చిన అధికారులకు కూడా ఆ మండలం యొక్క పరిస్థితి త్వరగా అర్థమవుతుంది అన్న ఎస్పీ
కౌంటింగ్ రోజున ముఖ్యమైన టౌన్ లలోకి బయట వ్యక్తులు ఎవరు రాకుండా టౌన్ ఎంట్రీ ,ఎగ్జిట్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తరువుగా చెక్ చేయవలసిందిగా అదే సమయంలో సామాన్య ప్రజలకు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కు ఎటువంటి అసౌకర్యం కలగచేయరాదని తెలియజేసినారు.
జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎటువంటి షాపులు తీయరాదని ఎక్కడ కూడా ముగ్గురు(3) కంటే ఎక్కువ మంది గుమికూడరాదని అలా గుమికూడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
జిల్లాలో వచ్చే నెల 2,3,4,5 తేదీలలో ఇదే విధమైన కర్ఫ్యూ వాతావరణం ఉండబోతుందని పోలీసు సిబ్బంది దీనిని గట్టిగా అమలు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అనంతరం రోడ్లపై ప్రజలు గుమి కూడరాదని, పార్టీ ఆఫీసులలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండరాదని ,పార్టీ ఆఫీసుల వద్ద తగిన బందోబస్తు కంసెటిన కాయిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
రౌడీషీటర్ లను ,ట్రబుల్ మంగార్స్ ను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని సదరు ఎస్ హెచ్ ఓ లను ఆదేశించారు.
రేపు సాయంత్రం నుంచి రోజు లాడ్జెస్, హాస్టల్స్,కళ్యాణ మండపాలను చెక్ చేయాలని అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు సాయుధ బలగాలతో నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా కౌంటింగ్ రోజు తదనంతరం ఏవైనా రాజకీయపరమైన గొడవలు, అల్లర్లు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారు ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని వారికి ధీటుగానే సమాధానం చెప్పాలి అని మీ వెనుక నేను వున్నానని ధైర్యం చెప్పి పోలీసులలో మనోధైర్యాన్ని పెంచిన ఎస్పీ
జిల్లాలో పట్టణ ప్రాంతాలలో సమస్యాత్మక గ్రామాలలో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారి ఆటలు సాగవని ఎస్పీ  తెలిపారు.

పట్టణ ప్రాంతాలలో, సమస్యాత్మక గ్రామాలలో అల్లరి మూకల కదలికలను గుర్తించుటకు డ్రోన్లను కూడా ఉపయోగించబోతున్నామని ఎస్పీ  తెలిపారు.

అనంతరం పిడుగురాళ్ల చేరుకొని పోలీసు సిబ్బంది లో మనోధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని కలిగిస్తూ సుమారు 500మంది సాయుద బలగాలతో పిడుగురాళ్ల టౌన్‌లో ఏర్పాటు చేసిన మెగా ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు.

అనంతరం పిడుగురాళ్ల జానపాడు రోడ్డు లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఎస్పీ  మాట్లాడుతూ..

జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడ కూడా ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమికూడా రాదని అలా గుమికూడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
విజయాంతరం ఎటువంటి ఉత్సవాలకు, ర్యాలీలకు, బాణాసంచా పేల్చుటకు, సభలు నిర్వహించడానికి వీలులేదని తెలియజేశారు.
కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అందరిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపుతామని తెలియజేశారు.
జిల్లాలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుద బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
జిల్లాలో ఏ పెట్రోల్ బంకు లోను విడిగా పెట్రోలు, డీజల్ అమ్మరాదని వారికి ముందస్తుగా నోటీసు ఇవ్వడం జరిగిందని అలా కాక విడిగా పెట్రోల్ అమ్మితే వారిపై చట్ట పప్రకారం చర్యలు తీసుకొని అట్టి పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని తెలియజేశారు.
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం 161 కేసులు కట్టడం జరిగింది దీనిలో ఇప్పటివరకు 1320 మందిని అరెస్టు చేయడం జరిగింది మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తాము దీనికి సంబంధించి ప్రత్యేక టీములను ఫామ్ చేసి ఉన్నాయని తెలియజేశారు.
అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 382 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగినది.

అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము.

అదేవిధంగా ఇప్పటివరకు 120 వాహనాలను సీజ్ చేసి 102సి ఆర్ పి ఎస్ కేసులు కట్టడం జరిగినది.
ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా అందులో సుమారు 250 మంది బైండోవర్ నీ ఉల్లంఘించడం జరిగినది వీరిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీరి చేత ఆ బాండ్ అమౌంటును కట్టించడం లేదా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది లేనిపక్షంలో వారంట్ తీసుకొని జైలుకు పంపడం జరుగుతుంది.
నేరాలను అదే పనిగా చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణ కొరకు ప్రపోసల్స్ రెడీ చేస్తున్నాము.
ప్రజలు ఎటువంటి నేరాలలో పాల్గొనరాదని, మీ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మీరు కేసుల్లో ఉంటే బెయిల్ కోసం మీ ఆస్తులు అమ్ముకోవాలి, మీరు ఇతర దేశాలకి చదువుల కోసం వెళ్లలేరు అని ఎస్పీ  తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగినది.

అనంతరం దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సమస్యాత్మక గ్రామాల నుండి వచ్చిన సుమారు 300 మంది ట్రబుల్ మంగర్స్ కి మరియు ఎన్నికల నేరాలలో ఉండి బెయిల్ పై బయటకొచ్చిన ముద్దాయిలకు ఎస్పీ  కౌన్సిలింగ్ ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని లేనియెడల రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని వారి ఆస్తులను జప్తు చేయిస్తామని హెచ్చరించారు.
అనంతరం దాచేపల్లి లైబ్రరీ సెంటర్లో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని, ఎవరు కూడా కౌంటింగ్ అనంతరం ఎటువంటి గొడవలలో పాల్గొనరాదని చెప్పగా అక్కడ ప్రజలందరూ ఎటువంటి గొడవలకు వెళ్ళమని  ఎస్పీ కి చెప్పినారు.

కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడడమే మా లక్ష్యమని దీనికి ప్రజలు,ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు సహకరించాలని కోరారు..

జిల్లా పోలీస్ కార్యాలయం,
పల్నాడు జిల్లా.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading