నారద వర్తమాన సమాచారం
మే :31
జర్నలిజాన్ని పవిత్రంగా నమ్మి త్రికరణశుద్ధిగా బాధ్యతలు నిర్వర్తించిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు ఆర్‌ఎన్ గోపాలకృష్ణ మరణం పాత్రికేయరంగానికి తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎన్ మీరా అన్నారు.
గతేడాది మృతిచెందిన జర్నలిస్టు కందుల శ్యామ్, ఈనెల 24న మరణించిన ప్రెస్ ఫొటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాసబాబు మృతి బాధాకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటి ఆధ్వర్యంలో మృతిచెందిన పాత్రికేయుల సంతాపసభను నిర్వహించారు. కమిటి తెనాలి అధ్యక్షుడు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభకు ఐజేయూ సభ్యుడు మార్కండేయులు స్వాగతం పలికారు. తో లుత చనిపోయిన జర్నలిస్టుల చిత్రపటాలకు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఎస్ ఎన్ మీరా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులు చిన్న వయసులోనే మరణిస్తుండటం ఇటీవలకాలంలో గమనిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యబీమాతో ప్రభుత్వం ఆదుకోవాలని, అనారోగ్యంతో మరణిస్తున్న వారికి ప్రభుత్వం జర్నలిస్టులకు 20 లక్షల రూపాయల ఎస్ గ్రెషియా ప్రకటించాలని సూచించారు. విలేకరులు తగు జాగ్రత్తలతో విధులను నిర్వర్తించాలని కోరారు. సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ సాధారణమైన కుటుంబాన్నుంచి వచ్చిన ఆర్‌ఎన్ గోపాలకృష్ణ పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రిటైరయ్యాక అర్చకుడిగా జీవితాన్ని గడిపారని వివరించారు.
ఐజేయూ సభ్యుడు, సీనియర్ విలేకరి బీఎల్ నారాయణ మాట్లాడుతూ ఆర్‌ఎన్ గోపాలకృష్ణ, చుక్కా శ్రీనివాసబాబు, కందుల శ్యామ్‌తో
తనకు గల అనుబంధాన్ని గుర్తుచే సుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చొప్పర సుధాకర్,కమీటీ సభ్యులు మురళీ ఎల్.వెంకటేశ్వరరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కారుమంచి సునీల్ సందీప్, బొల్లిముంత కృష్ణ, దేవయ్య, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.