నారద వర్తమాన సమాచారం
వేసవికాలం అధిక ఉష్ణోగ్రత దృష్ట్యా పెన్షన్ దారులకు ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి – పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్.
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశముల ప్రకారం పల్నాడు జిల్లాలో 2024 జూన్ 1వ తేదీన చెల్లించవలసిన పెన్షన్లు మొత్తం 280568 మందికి రూ :83.79కోట్లు కాగా డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా 205607మంది పెన్షన్ దారులకు రూ :61.68కోట్లు, అలాగే ఇంటివద్దకే పెన్షన్ ద్వారా 74899మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ :22.08కోట్ల పంపిణీ చేయటం జరుగుతుంది, అలాగే డిబిటి ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జామచేయటం జరుగుతుంది, కావున పెన్షన్ లబ్ధిదారులు సచివాలయం వద్దకు రానవసరంలేదు.ఎండలు తీవ్రంగా ఉన్నందున బ్యాంకుల వద్దకు ఓకేసారి అందరు వెళ్లి బారులు తీరి నిల్చొని వడగాల్పులకు గురికావద్దు, ఉదయం లేదా సాయంత్రం సమయం లో వెళ్లి తీసుకోవలెనని ప్రాజెక్ట్ డైరెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ వారు తెలియచేసారు.ఇంటివద్దకే పెన్షన్ జారీ చేయవలసిన పెన్షన్ సొమ్మును ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు విత్ డ్రా చేయవలెను, అలాగే జూన్ 1వ తేదీ నుండి జూన్ 5వ తేది సాయంత్రం లోపు పెన్షన్లు పూర్తి చేయవసినదిగా మరియు బ్యాంకులవద్ద బారులు తీరి పెన్షన్ కోసం వేచిఉండు లబ్దిదారులకు కనీస సౌకర్యాలు టెంట్, మంచినీళ్లు, ఏర్పాటు చేయవలసినదిగా ఎంపిడిఓ /మున్సిపల్ కమీషనర్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.