నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
జూన్ .01.
కౌంటింగ్ రోజున అనగా 04-6 2024వ తేదీ కౌంటింగ్ కేంద్రం అయినటువంటి నరసరావుపేట రూరల్ మండలంలోని కాకాని గ్రామం వద్దగల జె ఎన్ టి యు క్యాంపస్ వద్ద, అలాగే జిల్లాలో ఎక్కడ కూడా డ్రోన్స్ ఎగరవేయడానికి ఎవ్వరికి పర్మిషన్ లేదు- పల్నాడు ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్..
జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రజల యొక్క శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అవాంఛనీయ సంఘటనలను నివారించుటకై కౌంటింగ్ (04.6.2024 )రోజున జిల్లా వ్యాప్తంగా ఇతరులు డ్రోన్లను ఎగరవేయుటను నిషేధించదమైనది.
ఎవరైనా దీనిని ఉల్లంఘించి అనుమతి లేకుండా డ్రోన్లను ఎగరవేస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడును
దీనిని గమనించి ప్రజలందరూ, మీడియా సోదరులు సహకరించవలసిందిగా తెలియజేయడమైనది..
జిల్లా పోలీస్ కార్యాలయం,
పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.