నారద వర్తమాన సమాచారం
జూన్ :01
న్యాయం జరగకుంటే బాధితుల తరఫున పోరాటం చేస్తా
జైభీమ్ రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్
సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో1.54 ఎకరాల వ్యవసాయ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన వారి పై చర్యలు తీసుకోకపోతే బాధితుల తరుఫున పోరాటం చేస్తామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో సుమన్ టీవీ పాత్రికేయుడు తో ఆయన మాట్లాడారు. సదరు భూమి యజమాని మరణించినప్పటికీ లేని వ్యక్తి ఉన్నట్లుగా ఆయన వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించడం చూస్తే కార్యాలయం సిబ్బంది చేతివాటం ఉందని ఆరోపించారు. తప్పుడు పత్రాలకు వాత్తాసు పలికి ఆన్ లైన్ చేసిన తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలి కోరారు. గతంలో ఈ భూమికి ఆన్ లైన్ చేయన్నందుకు వీఆర్వో నెతగాని వినోద్ పై తప్పుడు ఆరోపణలు చేసి సదరు వ్యక్తులు ఏసిబి కి పట్టించినారని తెలిపారు. ఉద్యోగి, రైతును మోసం చేసిన సదరు వ్యక్తి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బాధితుల తరఫున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.