నారద వర్తమాన సమాచారం
జూన్ :01
3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ, ఎస్సై,
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో( ఏసీబీ) దాడులు చేసింది. మే 31వ తేదీ శుక్రవారం కుసాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కుషాయిగూడ పోలిస్టేషన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జి. వీరాస్వామి, ఎస్ఐ షఫిలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ల్యాండ్ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులను పంపించి రూ.3లక్షలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ.. కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు. రూ. 3 లక్షలు లంచం డబ్బులు తీసుకుంటూ పోలీసు అధికారులు.. ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.