
నారద వర్తమాన సమాచారం
జూన్ :02
కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కేష్ బి లాత్క ర్ ఆదివారం నరసరావుపేట కాకాని వద్ద జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ ఆదివారం ఉదయం సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా కార్గ్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్లో సిబ్బందికి ఏర్పాటుచేసిన పలు సదుపాయాలను పరిశీలించారు. సిబ్బంది కౌంటింగ్ సెంటర్లకు వెళ్లే మార్గాలలో ఏర్పాటుచేసిన బారికేడులను, గుర్తింపు చిహ్నాలను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందజేశారు. నియోజకవర్గాల వారిగా మొబైల్ ఫోన్లో భద్రపరిచే స్థలాలను సునిసితంగా పరిశీలించారు. పోలీసు సిబ్బందితో సమావేశమై భద్రత ఏర్పాట్లు గురించి వివరాలు సేకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఏ .శ్యాంప్రసాద్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








