
నారద వర్తమాన సమాచారం
ఈ నగరానికి ఏమైంది?
తెలంగాణ
:జూన్ 02
హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్ వచ్చేసింది.అంతేకాదు
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్ మాఫియా ఆగడాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఎక్సైజ్ పోలీసులు మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. కొత్త తరహా డ్రగ్స్ పై కన్నేసిన పెడ్లర్ల ఆటకట్టిం చారు. అత్యంత ప్రమాదక రమైన కుష్.. ఓజీ డ్రగ్స్‌ని పెడ్లర్ల నుంచిస్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు.
ముంబై నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ తరలించి విక్రయిస్తున్న గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని లాలగూడలో 10లక్షల రూపాయలు విలువచేసే కుష్.. ఓజీ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఎక్కువగా దొరికే కుష్ డ్రగ్ వల్ల లివర్, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని.. ఈ డ్రగ్ వాడటం వల్ల ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారుఎక్సైజ్ అధికారులు.
ఈ కుష్, ఓజీ మందు ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. పెడ్లర్ల నుంచి డ్రగ్స్‌తో పట్టుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
మరోవైపు హైదారాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరి యన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకి చెందిన ఒబాసి .. నైజీరి యన్ నుంచి కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెడ్లర్‌గా మారాడు.
2018లో కొకైన్ సరఫరా చేస్తుండగా గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కస్టమర్లకు టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ప్రస్తుతం రాంసి నుంచి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
లక్ష్మీపతి అనే మరో డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశామని అతని వద్ద నుంచి 43 ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.