
చెరువును తలపిస్తున్న రోడ్డు లను వెంటనే మరమ్మతులు చేపట్టాలి: సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో రోడ్లు గుంతల మయమై చెరువులను తలపిస్తున్నాయని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు అన్నారు. సోమవారం రోజున రేణుపల్లి గోస్కొండ పెద్ద రావులపల్లి రోడ్లను సందర్శించి మాట్లాడుతూ రేవనపల్లి నుండి పెద్ద రావుల పెళ్లికి వెళ్లే రోడ్డు పెద్దపెద్ద గుంతలుగా మారి వర్షాలు పడినప్పుడు చెరువులను తలపిస్తున్నాయని దానివల్ల ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు చాలా గుంతల మాయమై అనేక ఇబ్బందులు పడుతూ రేవనపల్లి గోస్కొండ మీదుగా వెళ్లాలంటేనే ప్రాణాలను హరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు పడడంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని రోడ్డు మాత్రం చాలా తీవ్రంగా గుంతలమయమై అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నారని అన్నారు. పెద్ద రావులపల్లి వరకు ఉన్న దారి జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి కానీ రోడ్డు మొత్తం గుంతలు మయం కావడంతో పోచంపల్లి నుండి బీబీనగర్ మీదుగా ప్రయాణం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గుంతల మయమైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంతల మయమైన రోడ్లను మరమ్మత్తులు చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కుతాటి అశోక్, తుపల్లి బాల్ రెడ్డి, దుబ్బాక దుర్గాప్రసాద్, మంకలి శివ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.








