నారద వర్తమాన సమాచారం
జూన్ :03
ఏలూరు జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్
కౌంటింగ్ సెంటర్ లోపలికి అనుమతులు పొందిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఏ విధమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ఫోన్లు గాని సిగరెట్లు గాని ఇతర మండే పదార్థాలను అనుమతించరాదు అని
వాహనాలు నిలుపుట కొరకు కేటాయించిన ప్రదేశాలలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి అని
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇతర డిపార్ట్మెంట్ల వారితో సమన్వయంతో విధులు నిర్వహించాలి.
ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం ఆని
కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ నియమ నిబంధనలు మీరి ప్రవర్తించిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు హెచ్చరించినారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ఒకరికి ఒకరు సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులకు తెలిపారు. సి .అర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద, చెకింగ్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాలలో విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో ఎస్పీ గారు సమావేశం నిర్వహించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా నిర్వహించవలసిన విధులు గురించి దిశ నిర్దేశం చేసినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బ్యారికేడింగ్, క్యూ లైన్ లు, క్లాక్ రూమ్ ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు పూర్తి అయినాయన్నారు. కౌంటింగ్ రోజున సి.అర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లోపల, పరిసర ప్రాంతాలలో, పార్కింగ్ ప్రదేశాలలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ సెంటర్ కు 200 మీటర్లు బయట వాహనాలని తనిఖీ చేసి పంపాలని, 100 మీటర్లు బయట అభ్యర్థులని, ఏజెంట్లని, విధులు నిర్వహించడానికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించి లోపలికి పంపాలని, లోపలికి వచ్చిన వారిని వారికి కేటాయించిన క్యూ లైన్ ల ద్వారానే లోపలికి పంపించాలని, కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ద్వారం దగ్గర మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,
కౌంటింగ్ కేంద్రాలలో నిబంధనలకు విరుద్ధంగా కవ్వింపు చర్యలకు, ఘర్షణలకు ఎవరైనా పాల్పడితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వివిధ పార్టీల అభ్యర్థులకు, ఏజెంట్లకు, ఉద్యోగస్తులకు వేరువేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి సూచించిన ప్రదేశాలలో వారికి సంబంధించిన వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణంలో విధులు నిర్వహించే పోలీస్ అదికారులు, సిబ్బంది గుంపులుగా ప్రజలు చేరకుండా చూసుకోవాలని, ఎవరైనా రోడ్ల మీదకు వస్తుంటే వెంటనే వారిని పంపించి వేయాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు, ఘర్షణలకు తావు లేకుండా ప్రతి ఒక్క పోలీస్ అధికారి మిగతా వారితో సమన్వయంతో పని చేసుకోవాలని తెలిపారు.
ఏలూరు జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది కనుక ఏలూరు పట్టణంలో దుకాణాలు, హోటల్లు, రెస్టారెంట్ లు, ఇతర వ్యాపార సముదాయాలు, లాడ్జి లు, రిసార్ట్స్, హోటల్ , ఇతర ప్రదేశాలలో ఎవరు బస చేయడానికి అనుమతి లేదన్నారు. కౌంటింగ్ రోజు సి ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్దకు అనుమతి లేని వారు రావద్దని, ఒకవేళ ప్రజలు ఎవరైనా వచ్చిన వారిని అక్కడ నుండి పంపించి వేయడం జరుగుతుందని, వారు ఏలూరు పట్టణంలో ఎక్కడ ఉండడానికి కూడా వీలులేదన్నారు. కనుక వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజలు సదరు విషయాన్ని గమనించి ఏలూరు పట్టణంలోకి రావద్దని, ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను వీక్షించవలెనని ఎస్పీ ప్రజలకు సూచించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని, ఇతరులను రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించి వ్యవహరించిన, ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ
కౌంటింగ్ బందోబస్తు కొరకు ఎస్పీ (ఎన్ సి ) 01 ఈ.సుప్రజా జె.డి ఆ.ను. శా, అదనపు ఎస్పీ లు 04, డిఎస్పీ 06, 28 సిఐ లు, 56 సివిల్ ఎస్ఐ లు, 04 ఎస్. పి .ఎఫ్ ఎస్ఐ లు, ఏ.అర్, అర్. ఐ లు 03 గురు, 04 గురు అర్.ఎస్. ఐలు, 1225 మంది పోలీస్ సిబ్బంది, 450 మంది సాయుధ బలగాలు, 650 సాయుధ పార్టీ, 5 గ్యాస్ పార్టీ, 2 వజ్ర, 48 ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్, 39 స్ట్రైకింగ్ ఫోర్స్, 130 పికిట్‌లు, 8 చెక్ పోస్ట్, వాటర్ కెనాన్స్, గ్యాస్ పార్టీలు, షాడో పార్టీ, బాక్స్ టైప్ కాన్వే, సోషల్ మీడియా పాయింట్, కంట్రోల్ రూమ్, డిటెన్షన్ సెంటర్, సిబ్బందిని వినియోగిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలియ చేసినారు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూప రాణి ,ఎస్.బి ఇన్స్పెక్టర్లు మల్లేశ్వర రావు అది ప్రసాద్ ఏలూరు డిఎస్పి ఈ శ్రీనివాసులు డిటిసి డిఎస్పి కే ప్రభాకర్ రావు నూజివీడు డిఎస్పి లక్ష్మయ్య జంగారెడ్డిగూడెం డీఎస్పీ పోలవరం డిఎస్పి సురేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ లో సిఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.