నారద వర్తమాన సమాచారం
జూన్ :04
విలాసవంతమైన జీవితం గడపాల్సిన తనయుడు.. ప్రజాసేవకు కదిలి ఎందరితోనో మాటలు పడితే ఏ తల్లికైనా బాధ కలుగుతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కొడుకు అనుకున్నది సాధిస్తే ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం ఈ అనుభూతినే పొందుతున్నారు నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి . ఆమె తన సంతోషాన్ని ఓ వీడియో ద్వారా వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడడం అందరినీ ఆకర్షిస్తోంది. ‘‘మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు. ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతా’’ అంటూ టీని ఆస్వాదిస్తూ కనిపించారామె.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.