Wednesday, July 2, 2025

టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టీలో కీలక హామీలు …

నారద వర్తమాన సమాచారం

జూన్ :04

టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టీలో కీలక హామీలు …

మెగా డీఎస్సీపై మొదటి సంతకం
సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు
ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు
పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం
ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ
చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ
ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ
చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు
ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం
స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం
డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం
ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ
ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు
చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు
ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం
ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం
కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు
అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం
ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం
దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు
వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు
జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ
న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు
లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు
రాజధానిగా అమరావతి కొనసాగింపు
ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా
అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు
విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading