నారద వర్తమాన సమాచారం
జూన్ :04
తాజ్‌మహల్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఫైర్ సిబ్బంది అప్రమత్తం..
ఢిల్లీలో తాజ్‌మహల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సరితా విహార్ స్టేషన్ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు అధికారులు. పక్క బోగీలకు వ్యాపిస్తున్న మంటలను వెంటనే అదుపు చేశారు.
ఈ క్రమంలో రైలును సరితా విహార్ స్టేషన్లో నిలిపేశారు. దీంతో కొద్దిపాటి ఆలస్యంగా రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.