నారద వర్తమాన సమాచారం
జూన్ :04
రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం : ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది.. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది.
రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లు ఉన్నాయి..ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుంది.
భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి.
కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయి.
కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు.
కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదు.
మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చు : ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా
ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు : ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా
4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.
26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు.
26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు.
పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం.
అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.