నారద వర్తమాన సమాచారం
జూన్ :05
ఐదేళ్ల అరాచకంపై జగన్ చెంప చెల్లుమనిపించేలా ప్రజా తీర్పు: ప్రత్తిపాటి
కుటుంబసభ్యులతో గెలుపు సంబరాల్లో పాల్గొన్న ప్రత్తిపాటి
ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల అరాచకంపై చెంప చెల్లుమనిపించేలా ప్రజలు తీర్పునిచ్చారని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆ దేవుడికే తెలియాలంటున్న జగన్ నటనలో అపరిచితుడుని మించి పోతున్నారనీ ఎద్దేవా చేశారు. వైకాపా ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముమ్మాటికీ సీఎం జగనే అన్న ప్రత్తిపాటి సొంత జిల్లాలోనే వైకాపా కుదేలవడం ప్రజల తిరస్కారానికి త్కారణమన్నారు. అందుకే సీఎం జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోలు ప్రకటనలోనూ నిజాయతీ కనిపించండ లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో పాటు పల్నాడు జిల్లాలో మంచి మెజార్టీతో ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందడంతో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బుధవారం తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయం ఎంతో ప్రత్యేకమైందని, ఎన్నికలకు ఆరు నెలల ముందే తన గెలుపు ఖాయమైందన్నారు. ఆధిక్యం ఎంత వస్తుందనే ముందు నుంచి ఆలోచించామన్నారు. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని 33 వేలకుపైగా మెజార్టీ అందించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞ తలు తెలుపుకుంటున్నా అన్నారు ప్రత్తిపాటి. ఫలితాల అనంతరం అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ప్రేమలు ఏమై పోయాయో అంటూ దొంగనాటకాలు ఆడుతున్న జగన్‌కు నిజం గా ప్రజలకు ఎందుకు నేలకేసి కొట్టారో అర్థం కానంత అమాయకుడా ప్రశ్నించారు. చెడుపై ఎప్పటికీ మంచిదే విజయమని ప్రజలు మరోసారి నిరూపించారనన్న ఆయన మోదీ, చంద్రబాబు , పవన్ జట్టు రాష్ట్రంలో సూపర్‌హిట్టు అవుతుందని తాము మొదట్నుంచీ చెబుతున్నా మన్నారు. ఇక ఇప్పుడు ప్రజలు కోరుకున్న మార్పును అందించడమే మా ముందున్న కర్తవ్యమన్నారు. పల్నాడు కొంతకాలంగా కూటమికి నెలకొన్న అనుకూల వాతావరణంతో పాటు 30 ఏళ్లుగా నియోజకవర్గంతో ఉన్న అనుబంధం తనను గెలుపుబాటలో నడిపించిందన్నారు. ఈ అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటానని.. వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.