ననారద వర్తమాన సమాచారం
దేశ రాజకీయాల్లో లెజెండ్ గా మారనున్న చంద్రబాబు
అమరావతి
:జూన్ 05
సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ… మెజారిటీ గతం కంటే తగ్గింది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలిం చిన బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటులో చంద్ర బాబు కీలక పాత్ర పోషించ నున్నారు. ఎన్డీయే కూటమి లో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది. దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్‌గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాంపుల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
బీజేపీ తర్వాత తెలుగుదే శం మినహా మరే పార్టీకి అన్ని సీట్లలో విజయం సాధించలేవు. ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా… తెలుగు దేశం పార్టీ సింగిల్‌గా 16 సీట్లు సాధించుకుంది. ఈ బిగ్ నంబర్‌తో ఎన్డీయే లో మోడీ తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు.
బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్ప డానికి సరిపడా అన్ని అవకాశాలు బాబుకు ఉన్నాయి. ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకం అయింది.
ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడే..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.