
నారద వర్తమాన సమాచారం
జూన్ 06
తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాటి
ఇప్పటికైనా ప్రజలపై నిందలు వేయడం, సాకులు మాని వైకాపా, జగన్ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలని హితవు పలికారు మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడమంటే మోసాల పునాదులపై ఎదిగి అబద్ధపు ప్రచారాలతో నెట్టుకొచ్చినంత సుళువు కాదని ఇప్పటికైనా వాళ్లు తెలుసుకుంటే మేలన్నారాయన. చంద్రబాబు వంటి అలుపెరగని పోరాటయోధుడిని అవమానించిన, అక్రమకేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని ఇంకా గ్రహించలేక పోతే ఎలా అని చురకలు వేశారు. కూటమి అద్భుత విజయం, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు కేంద్రంగా కీలకశక్తిగా తెలుగు దేశం పార్టీ అవతరించిన నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వక ంగా కలిశారు ప్రత్తిపాటి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నుంచి 33 వేలకుపైగా ఓట్లతో గెలుపొందిన ప్రత్తిపాటిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి అయిదేళ్లుగా వైకాపా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పార్టీని ఎంతగా విచ్ఛిన్నం చేయాలని చూసినా కార్యకర్తలు, నాయకు ల్లో చంద్రబాబు నింపిన స్ఫూర్తే తమను మళ్లీ ఈ స్థాయిలో తలెత్తుకుని నిల్చునేలా చేసిందన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.