నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
తేదీ.06.6.2024.
పల్నాడు జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం, ఇప్పటికి 60 మందిని అరెస్టు చేశాం- పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్
పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వున్నప్పటికీ కొంతమంది గుంపులుగా చేరి గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి, ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేసిన అన్ని సంఘటనలపై కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసుల దర్యాప్తును ప్రత్యక్షంగా ఎస్పీ పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
దీనిలో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి,274 మందిని ముద్దాయిలుగా గుర్తించి,85 మందిని అరెస్టు చేయడం జరిగినది. కొంతమంది పరారీలో ఉన్నారు వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ ఒక్క రోజే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 72మందిని అరెస్టు చేశామని వారినీ రిమాండ్ కి పంపిస్తామని తెలియజేశారు.
ఎవరైనా ప్రభుత్వ ఆస్తులైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లపై దాడులు చేసిన, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన, వ్యక్తిగత దాడులకు పాల్పడిన అట్టి వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.
ప్రజలెవ్వరూ కూడా గ్రామాల్లో,పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడరాదని,కవ్వింపు చర్యలకు పాల్పడరాదని,విజయోత్సవ ర్యాలీలకు దూరంగా ఉండాలని ఇటువంటి వాటిలో పాల్గొంటే అట్టి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు..
జిల్లా పోలీస్ కార్యాలయం,
పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.