
నారద వర్తమాన సమాచారం
జూన్ :06
ఉండవల్లి
ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు
కరకట్ట, కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు
వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు
తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సీఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు
ఉండవల్లి నివాసం నుండి ఎయిర్ పోర్టుకు వెళ్లేలోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు సమాచారం ఇచ్చిన చంద్రబాబు భద్రతా సిబ్బంది
కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు తెలిపిన సీఎస్ఓ
భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించిన చంద్రబాబు
భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు
బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడలకు ఇక స్వస్థి చెప్పాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.