నారద వర్తమాన సమాచారం
జూన్ :07
ఆస్తమా పేషెంట్స్ అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం..
_ ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు
తెలంగాణ లో చేప ప్రసాదం పంపిణీకి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె ప్రారంభంలో ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చేప మందు.
చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు బత్తిన కుటుంబీకులు. ఈ నెల 8, 9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్తమాతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిరానున్నారు.
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన కుటుంబీకులు చెప్పారు.
చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మార్గంలో.. 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.